Gaza Truce Expired : మళ్లీ యుద్ధమేనా.. ఇజ్రాయెల్ – హమాస్ ‘కాల్పుల విరమణ’ డీల్ క్లోజ్
Gaza Truce Expired : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం 7 గంటలకు ముగిసింది.
- By Pasha Published Date - 11:32 AM, Fri - 1 December 23

Gaza Truce Expired : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం 7 గంటలకు ముగిసింది. కాల్పుల విరమణ ఒప్పందం వారం క్రితం(నవంబర్ 24న) ప్రారంభమైంది. ఇది మొదట్లో నాలుగు రోజుల పాటు కొనసాగింది. ఆపై ఖతార్, ఈజిప్టు రాయబారంతో మరో మూడు రోజుల పాటు పొడిగించబడింది. ఈ వారం రోజుల సంధి సమయంలో గాజాలోని హమాస్ మిలిటెంట్లు 100 మందికిపైగా బందీలను విడుదల చేశారు. విడుదలైన వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెలీ పౌరులే ఉన్నారు. దీనికి ప్రతిఫలంగా 240 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌లోని జైళ్ల నుంచి విడుదల చేశారు. వీరంతా పాలస్తీనా మహిళలు, పిల్లలే.
We’re now on WhatsApp. Click to Join.
కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఖతర్, ఈజిప్టు నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో మళ్లీ హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటివరకు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 14 వేలమంది అమాయక పౌరులు చనిపోయారు. వీరిలో దాదాపు 10వేల మంది పిల్లలు, మహిళలే కావడం బాధాకరం. మరోవైపు అమెరికా, ఫ్రాన్స్, టర్కీ, బ్రిటన్ సహా ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలని కోరుతున్నాయి. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ? అనే దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశాలు(Gaza Truce Expired) ఉన్నాయి.