Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్ జిల్లా బారేడుబాక అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి.
- By Latha Suma Published Date - 08:01 PM, Thu - 16 January 25

Chhattisgarh : ఇటీల మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోతుంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 11 మంది ప్రాణాలు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగింది.
బీజాపూర్ జిల్లా బారేడుబాక అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఘటన స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఆదివారం కూడా భద్రత సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో, భద్రతా దళాల వ్యూహాత్మక చర్యలు, మరియు మావోయిస్టులపై జరిగిన గట్టిగానూ చర్యలు, ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం పట్ల బలమైన దెబ్బలు ఇస్తున్నాయని సూచిస్తాయి. 2019 తర్వాత మావోయిస్టు గ్రూపులు ఈ ప్రాంతంలో మరింత స్థిరపడినట్లు కనిపించాయి. కానీ ప్రస్తుతం భద్రతా దళాలు అన్నీ కలిసి, ప్రత్యేకంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ నక్సల్స్ పై చర్యలు మరింత కట్టుదిట్టంగా సాగిస్తున్నాయి.