Honduras Mass Shooting: హోండురాస్‌లో కాల్పుల ఘటన.. 11 మంది మృతి
హోండురాస్‌లోని వాయువ్య ప్రాంతంలో ఉన్న బిలియర్డ్ హాల్‌లో కాల్పుల (Honduras Mass Shooting) ఘటన జరిగింది.
- By Gopichand Published Date - 01:48 PM, Sun - 25 June 23

Honduras Mass Shooting: హోండురాస్‌లోని వాయువ్య ప్రాంతంలో ఉన్న బిలియర్డ్ హాల్‌లో కాల్పుల (Honduras Mass Shooting) ఘటన జరిగింది. BNO న్యూస్ నివేదిక ప్రకారం.. ఈ కాల్పుల ఘటనలో కనీసం 11 మంది మరణించారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు. దీనికి ముందు కూడా హోండురాస్‌లోని ఒక జైలులో మహిళా ఖైదీల మధ్య ఘోరమైన అల్లర్లు జరిగాయి. దీని కారణంగా 41 మంది మహిళా ఖైదీలు మరణించారు. ఈ అల్లర్లలో రెండు ముఠాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ తర్వాత పోరాటంలో చెలరేగిన మంటల కారణంగా చాలా మంది మహిళా ఖైదీలు కాలిపోయారు.
Also Read: Electrocution: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాదం..విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి
ప్రపంచంలోని టాప్ 5 దేశాలలో హోండురాస్
నేరాల రేటు అత్యధికంగా ఉన్న ప్రపంచంలోని టాప్ 5 దేశాలలో హోండురాస్ చేర్చబడింది. ఓ నివేదిక ప్రకారం.. వెనిజులాలో అత్యధిక నేరాల కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు 84 శాతం. అదే సమయంలో హోండురాస్‌లో నేరాల రేటు 75 శాతానికి దగ్గరగా ఉంది. హోండురాస్‌లో నేరాల వెనుక ఉన్న అతిపెద్ద హస్తం దోపిడీ. ఇక్కడ ఒక సంవత్సరంలో దోపిడీ ద్వారా సుమారు $ 737 మిలియన్ల వార్షిక లాభం ఉంది. ఇది మొత్తం దేశం GDPలో 3 శాతం మాత్రమే. ఇది కాకుండా ఒక నివేదిక ప్రకారం.. హోండురాస్ 2022 అధికారిక నేరాల రేటు ప్రకారం 1 లక్ష మందిలో 36 మంది హత్యకు గురయ్యారు. దేశంలో న్యాయం జరగకపోవడమే దేశంలో అరాచకానికి దారితీసింది.