Electrocution: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాదం..విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి
దేశంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
- By Praveen Aluthuru Published Date - 01:25 PM, Sun - 25 June 23

Electrocution: దేశంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఆవరణలో కురుస్తున్న వర్షం కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.
శనివారం అర్థరాత్రి కురిసిన వర్షపు నీరు స్టేషన్ ఆవరణలోకి చేరింది. ఆ సమయంలో చండీగఢ్ వెళ్లేందుకు భర్తతో కలిసి ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సాక్షి అహుజా మహిళ స్టేషన్ ఆవరణలోని విద్యుత్ స్తంభానికి తగిలి విద్యుత్ షాక్ కు గురైంది. దాంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లేడీ హార్డింజ్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రైల్వే అధికారుల తీరుపై దర్యాప్తు ప్రారంభించారు.
Read More: Yamaha R3: ఇండియా మార్కెట్ లోకి యమహా R3.. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి..!