Rains In AP : ఉత్తర కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన
దక్షిణ కోస్తాను ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నాటికి ఉత్తర కోస్తా, దానికి
- By Prasad Published Date - 09:39 AM, Sat - 6 August 22

దక్షిణ కోస్తాను ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నాటికి ఉత్తర కోస్తా, దానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఈ ప్రభావంతో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. శనివారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో ఈ నెల ఏడో తేదీకల్లా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది.
దీని ప్రభావంతో ఈ నెల 9 వరకు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని.. బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలంగా ఉండడం, ఉత్తరకోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.