Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జంటనగరాలలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 05:49 PM, Sun - 23 June 24
Hyderabad Rains: ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జంటనగరాలలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో వనస్థలిపురం ఉంది. ఇక్కడ కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి జలమయమైంది.
భారీ వర్షం కారణంగా హైవే వెంబడి రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా, వరదనీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఆదివారం కావడంతో వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో కొంత ఇబ్బంది లేదనే చెప్పాలి. లేదంటే అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య భారీగా ఉండేది. కాగా ఈ రోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణ సమాచారం ఇవ్వడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
Also Read: CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి