KTR : 24 గంటల విద్యుత్ రుజువు చేస్తే.. బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తాం
KTR : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా, 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర చర్చ చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా కేటీఆర్, కోమటిరెడ్డికి బలమైన సవాలును విసిరారు.
- By Kavya Krishna Published Date - 12:02 PM, Sat - 21 December 24

KTR : రైతు భరోసా పథకంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా, 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర చర్చ చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా కేటీఆర్, కోమటిరెడ్డికి బలమైన సవాలును విసిరారు.
“24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు మీరు చూపించగలిగితే, బీఆర్ఎస్ శాసనసభా పక్షం మొత్తం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం,” అని మంత్రి కోమటిరెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. “గతంలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని మీరు సభను తప్పుదోవ పట్టించడం సరికాదు. మా పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ సరఫరా చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే చెప్పారు. మీరు గనక అసలు నిజాలను తెలుసుకోవాలనుకుంటే భట్టి విక్రమార్కను ప్రశ్నించండి,” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Pitch For Boxing Day Test: నాలుగో టెస్టు జరిగే పిచ్ ఇదే.. ఫాస్ట్ బౌలర్లకు ప్లస్ పాయింట్?
కేటీఆర్ మాట్లాడుతూ.. “మీరు కోరినట్లే, సభ వాయిదా వేసి నల్లగొండ జిల్లాకు వెళ్లి విద్యుత్ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిద్దాం. విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథపై పూర్తి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాక, నల్లగొండ జిల్లా అభివృద్ధిపై కూడా చర్చిస్తాం” అని తెలిపారు. అంతేకాకుండా.. “గతంలో జరిగిన తప్పులను ఎత్తి చూపితే మీకు ఇబ్బందిగా అనిపిస్తోందా? కానీ, గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రం మీరు డబ్బా కొడుతున్నారని నాకు అనిపిస్తోంది. మీరు బదులుగా అభివృద్ధిపై చర్చకు సిద్ధమైతే, మేము కూడా సానుకూలంగా స్పందిస్తామన్నారు కేటీఆర్.
మరికొన్ని రోజులు సభా సమావేశాలను పొడిగించాల్సిందిగా నేను కోరుతున్నాను అని కేటీఆర్ అన్నారు. ఈ మాటల యుద్ధం శాసనసభలో ఉత్కంఠ రేకెత్తించగా, ఈ అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య చర్చ ఇంకా కొనసాగింది. 24 గంటల విద్యుత్ సరఫరా, నల్లగొండ అభివృద్ధి, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై మరిన్ని చర్చలు జరగవలసి ఉంది.
Rythu Bharosa: తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్.. రైతు భరోసా అప్పటినుంచే!