Gruha Lakshmi Scheme : ఈరోజు నుంచే ప్రతి ఇంటి మహిళా పెద్ద అకౌంట్లో నెలకు రూ.2000
Gruha Lakshmi Scheme : ప్రతి ఇంటికి చెందిన మహిళా పెద్దకు నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నుంచి అమలు చేయనుంది.
- Author : Pasha
Date : 19-07-2023 - 10:52 IST
Published By : Hashtagu Telugu Desk
Gruha Lakshmi Scheme : ప్రతి ఇంటికి చెందిన మహిళా పెద్దకు నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నుంచి అమలు చేయనుంది. దీంతో కర్ణాటక సర్కారు అమలుచేస్తున్న నాలుగో ఎన్నికల హామీగా “గృహలక్ష్మి” పథకం(Gruha Lakshmi Scheme )నిలువనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కర్ణాటక విధాన సౌధలోని బాంక్వెట్ హాల్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లబ్ధిదారులకు మంజూరు పత్రాన్ని అందజేయనున్నారు. ఈ పథకం లోగోను, పోస్టర్‌ను మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ విడుదల చేయనున్నారు.
Also read : Largest Office: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం భారత్ లోనే.. ఎక్కడ ఉందో తెలుసా..?
రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు 15న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రేషన్ కార్డుపై పేరున్న ఇంటి మహిళా పెద్దకు చెందిన బ్యాంకు ఖాతాలో ప్రతినెలా 2000 రూపాయలు వేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ ను ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఆ మహిళ భర్త ఆధార్ కార్డు ను కూడా ఇవ్వాలి. GST, ఆదాయపు పన్ను చెల్లింపుదారుల భార్యలకు ఈ పథకం వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ గృహలక్ష్మి పథకం నమోదు ప్రక్రియను ప్రారంభించింది.
Also read : Platelets: ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. అయితే వీటిని ట్రై చేయండి..!
5 హామీలలో ఆ ఒక్కటి తప్పితే..
కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో 5 హామీలను ఇవ్వగా.. వాటిలో “శక్తి పథకం” ఇప్పటికే అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర మహిళలు ఫ్రీగా కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. “అన్నభాగ్య” పథకంలో భాగంగా పేదలకు బియ్యం కాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. ఇక గృహజ్యోతి పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కోటి దాటాయి. అయితే ‘యువనిధి’ పథకం ప్రారంభం కాస్త ఆలస్యం కానుంది.