HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Give Women A Chance To Commit A Murder Rohini Khadse Appeals To The President

Rohini Khadse : మహిళలు ఒక మర్డర్ చేసేందుకు అవకాశం ఇవ్వండి: రాష్ట్రపతికి రోహిణి ఖడ్సే విజ్ఞప్తి

మహిళల కిడ్నాప్, గృహహింస నేరాలు పెరుగుతుండటంతో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా భారతదేశం ఉందని ఒక సర్వే నివేదికను కూడా ఆమె ప్రస్తావించారు. చివరగా 'మా డిమాండ్ పై ఆలోచించి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం' అని ఖడ్సే అన్నారు.

  • Author : Latha Suma Date : 08-03-2025 - 7:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Give women a chance to commit a murder: Rohini Khadse appeals to the President
Give women a chance to commit a murder: Rohini Khadse appeals to the President

Rohini Khadse : ‘స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి’ అని NCP SP మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే లేఖ రాశారు. మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్న నైపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించాలని ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని వేడుకున్నారు. దేశంలోని మహిళలకు ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం కల్పించాలని ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయడం సంచలనం రేపుతోంది.

Read Also: Mahila Samriddhi Yojan : త్వరలోనే అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం: సీఎం రేఖా గుప్తా

అయితే సమాజంలో మహిళలను అణచివేసే మనస్తత్వం, రేపిస్ట్ మనస్తత్వం, శాంతిభద్రతలకు భంగం కలిగించే ధోరణులను కలిగివున్న వారిని చంపాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. మహిళల కిడ్నాప్, గృహహింస నేరాలు పెరుగుతుండటంతో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా భారతదేశం ఉందని ఒక సర్వే నివేదికను కూడా ఆమె ప్రస్తావించారు. చివరగా ‘మా డిమాండ్ పై ఆలోచించి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం’ అని ఖడ్సే అన్నారు. మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రోహిణి ఖడ్సే అన్నారు.

కాగా, ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో చర్చలకు దారితీస్తున్నాయి. రోహిణి ఖడ్సే తాను మహిళల పై వివిధ రకాల అత్యాచారాలు, వేధింపుల ఘటనలు మరియు ఈ విషయంలో చట్టాలు సమర్థంగా పని చేయడం లేదు అని తేల్చారు. మహిళల మనోభావాలు, గౌరవం రక్షించుకునేందుకు వారు సమాజంలో తమ రక్షణ కోసం స్వయంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనపై కొంతమంది అనుకూలంగా స్పందించగా, మరికొందరు మాత్రం దీనిని సమర్థించలేదు. వారు, ‘‘అలాంటి చర్యలు చట్ట వ్యతిరేకం’’ అని అభిప్రాయపడ్డారు. అయితే, రోహిణి ఖడ్సే దీనిపై విశ్లేషణను మరింతగా పెంచుతూ, ‘‘మహిళలు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరి భద్రత ముఖ్యమైనదే’’ అని తెలిపారు. రాష్ట్రపతి కార్యాలయం ఈ విజ్ఞప్తిని పరిశీలించి, సమాజంలో మహిళల భద్రతకు సంబంధించి కొత్త ఆలోచనలు చేయడానికి సమయం వచ్చింది అని భావిస్తున్నారు.

Read Also: All party MPs meeting : రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి: డిప్యూటీ సీఎం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • letter
  • murder
  • No punishment
  • President Draupadi Murmu
  • Rapist mentality
  • Rohini Khadse
  • womens
  • womens Oppression

Related News

Arrest

Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మే 23న మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం వెలుపల ఖాజా మొయిజుద్దీన్‌పై కారు దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మృతి చెందారు. మొయిజుద్

  • Murder 1

    Murder : భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. వ‌డ‌దెబ్బ అంటూ డ్రామా..!

Latest News

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd