All party MPs meeting : రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి: డిప్యూటీ సీఎం
రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కేంద్రం దగ్గర అపరిష్కృత అంశాలపై చర్చ జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది.
- By Latha Suma Published Date - 05:33 PM, Sat - 8 March 25

All party MPs meeting : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రజాభవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 28 అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. విభజన సమస్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కేంద్రం దగ్గర అపరిష్కృత అంశాలపై చర్చ జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది. నిధులపై పార్లమెంట్‌లో ఎలా పోరాడాలో చర్చించినట్లు తెలిపారు.
Read Also: Nara Lokesh: బ్రాహ్మణికి ఇంకో కొడుకును నేనే.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్‌లో ఏయే అంశాలు లేవనెత్తాలనే విషయాలపై చర్చించి విపులంగా బుక్‌లెట్ తయారు చేసినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పదేళ్లు బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఏడాదిగా తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమావేశానికి రాని ఎంపీలకు బుక్‌లెట్ అందిస్తామన్న భట్టి విక్రమార్క అవసరమైతే మరోసారి భేటీ నిర్వహించేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన సహా అనేక ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందట్లేదన్నారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా అవసరమైతే పార్లమెంట్ సమావేశాల్లో అడ్జెయిన్ మెంట్ మోషన్ ఇచ్చే అవకాశాలను ఎంపీలకు వివరించామని చెప్పారు.
ఇకపోతే.. ఈ సమావేశానికి చివరి నిమిషంలో బీజేపీ ఎంపీలు గైర్హాజరు అయ్యారు. ఆహ్వానం ఆలస్యంగా అందిందని.. ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం కూడా లేదు.. ముందుగా నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నాం.. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే కాస్త ముందుగా తెలియాజేయాలని కిషన్ రెడ్డి భట్టికి లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇకముందూ చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటుంది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.