Mahila Samriddhi Yojan : త్వరలోనే అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం: సీఎం రేఖా గుప్తా
ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద పేర్ల నమోదు కేసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
- By Latha Suma Published Date - 06:25 PM, Sat - 8 March 25

Mahila Samriddhi Yojan : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మహిళాలకు శుభవార్తల తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళా సమృద్ధి యోజనను త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద పేర్ల నమోదు కేసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఢిల్లీ మహిళలకు ఆర్థిక సాయం పథకం ఆమోదం పొందిన విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వెల్లడించారు.
Read Also: All party MPs meeting : రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి: డిప్యూటీ సీఎం
ఈ పథకం ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం, వారిని ఆర్థికంగా మన్నికైన స్థితిలో నిలపడం లక్ష్యం. “మహిళల భవిష్యత్తును సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంకితంగా పనిచేస్తోంది. ఈ నిర్ణయం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం ” అని సీఎం రేఖా గుప్తా అన్నారు. ఈ కార్యక్రమం అంగన్వాడీ, పల్లెలో నివసించే మహిళలు, కుటుంబ సంక్షోభం ఎదుర్కొనే వారికీ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సాయంతో మహిళలు స్వయం ఉపాధి పొందడంలో మరింత ముందడుగు వేయగలుగుతారు. ఆర్థికంగా సంతోషకరమైన ఈ ప్రణాళిక త్వరలో అమల్లోకి రాబోతోంది అని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు.
ఇక, ఎన్నికల మేనిఫెస్టో హామీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో పేద మహిళలకు ఆర్థిక సాయం పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు తన నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశాం అని ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నారు. ఇందులో అశీష్ సూద్, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా వంటి సీనియర్ మంత్రులు కూడా ఉన్నారని సీఎం చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేస్తామని బీజేపీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆమ్‌ఆద్మీ పార్టీ నెలకు రూ.2100 ఇస్తామని చెప్పగా.. బీజేపీ మాత్రం మరో నాలుగు వందలు పెంచింది. దీంతోపాటు పలు వ్యూహాలతో ముందుకెళ్లిన కాషాయ పార్టీ.. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48చోట్ల విజయం సాధించి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.