Fire Accident: హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్ లోని ఇన్ఫినిటీ మాల్లో ఉన్న సినిమాహాల్లో అగ్ని ప్రమాదం జరిగింది.
- By Praveen Aluthuru Published Date - 03:29 PM, Sat - 12 August 23
![Fire Accident: హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/08/new-web-story-copy-2023-08-12T152940.327.jpg)
Fire Accident: హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్ లోని ఇన్ఫినిటీ మాల్లో ఉన్న సినిమాహాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో ఉన్న మల్టీప్లెక్స్ సినిమా హాల్‌కు మంటలు వేగంగా వ్యాపించాయి. అదృష్టశావత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Fire in Maruthi Infinity Mall Chanda Nagar, Hyderabad. Five screens got burnt. Fire tenders and DRF teams reached to the spot to extinguish the flames. No casualties reported so far.@XpressHyderabad @NewIndianXpress pic.twitter.com/14AJ0ikME6
— Bachanjeetsingh_TNIE (@Bachanjeet_TNIE) August 12, 2023
ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పబ్లిక్ లేకపోవడంతోనే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదంటున్నారు స్థానికులు. మల్టీప్లెక్స్‌లోని ఐదు స్క్రీన్లలో మూడు స్క్రీన్ లు పూర్తిగా దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చేశారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చందానగర్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి విచారిస్తున్నారు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Jagtial: జగిత్యాలలో విషాదం, కుక్కకాటుతో 12 ఏళ్ల బాలిక మృతి
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![90 Employees layoff : 90 మంది ఉద్యోగులను తొలగించిన ‘టిస్’](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/90-Employees-layoff.jpg)
90 Employees layoff : 90 మంది ఉద్యోగులను తొలగించిన ‘టిస్’
హైదరాబాద్‌లోని ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ (టిస్) సంచలన నిర్ణయం తీసుకుంది.