HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fifteen Telangana Students Arrived In Hyderabad From Ukraine Today

Telangana: ఉక్రెయిన్ నుండి హైద‌రాబాద్‌కు చేరుకున్న.. 15 మంది తెలంగాణ విద్యార్ధులు..!

  • Author : HashtagU Desk Date : 27-02-2022 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ukraine Telangana Students
Ukraine Telangana Students

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయ విద్యార్ధులు క్ర‌మంగా స్వ‌దేశానికి చేరుకుంటున్నారు. ఈక్ర‌మంలో 218 మందితో బుకారెస్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ఇండియాకు చేరుకుంది. ఉక్ర‌యిన్ నుండి స్వ‌దేశానికి వ‌చ్చిన ఈ తొలిబ్యాచ్‌లో 15 మంది తెలంగాణ విద్యార్ధులు ఉన్నారు. ఈ నేప‌ధ్యంలో ఈరోజు ముంబై నుండి హైద‌రాబాద్‌కు చేరుకున్న విద్యార్ధుల‌ను, వారి త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్య‌లు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు.

విద్యార్థులకు స్వాగతం పలికిన వారిలో సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఈ క్ర‌మంలో తమను సురక్షితంగా తరలించినందుకు భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.రొమేనియాకు వెళ్లేందుకు సరిహద్దు దాటి అక్కడి నుంచి విమానం ఎక్కినట్లు చెప్పారు. విద్యార్థులు తిరిగి రావడానికి భారత రాయబార కార్యాలయం మరియు తమ విశ్వవిద్యాలయాల అధికారులు అన్ని సహాయ సహకారాలు అందించారని చెప్పారు. తమ స్నేహితులు చాలామంది అక్క‌డ‌ ఒంటరిగా ఉన్నారని విద్యార్థులు తెలిపారు. కొందరు ఇప్పటికీ హాస్టళ్లలో ఉండగా మరికొందరు బంకర్లలో ఉన్నారని తెలిపారు. 70 వేల నుంచి 90 వేల వరకు అధిక ప్రయాణ ఛార్జీలు ఉండడంతో చాలా మంది విద్యార్థులు తిరిగి రాలేకపోతున్నారని మరో విద్యార్థి తెలిపారు. ఇక‌పోతే న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 23 మంది విద్యార్థులు భారతదేశానికి తిరిగి వచ్చార‌ని, మరికొంత మంది విద్యార్థులు ఈరోజే హైదరాబాద్ చేరుకోనున్నారని అధికారులు వెల్ల‌డించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • First batch 15 Telangana students
  • hyderabad
  • ukraine

Related News

Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో రాజేశ్వరి అనే వివాహిత అదృశ్యమైంది. ఆమెను భర్త శివకుమార్ ‘పెరుగు తింటే లావు అవుతావు’ అని అన్నందుకు మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త సరదాగా అన్న మాటలను రాజేశ్వరి సీరియస్‌గా తీసుకుని ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైంది. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుక

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

  • LPL Financial opens first GCC outside US in Hyderabad

    హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

Latest News

  • Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • IPL 2026 SRH vs CSK : 10 రన్స్ తేడాతో CSK పై SRH విజయం

  • IPL 2026 -RCB vs DC : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో DC విజయం

  • NBK-Koratala Shiva : బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్న కొరటాల ?

  • Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd