HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Lpl Financial Makes Massive Investment In Hyderabad

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

  • Author : Vamsi Chowdary Korata Date : 16-04-2026 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
LPL Financial opens first GCC outside US in Hyderabad
LPL Financial opens first GCC outside US in Hyderabad

LPL Financial  అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ ‘ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్’ తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 450కి పైగా జీసీసీలు ఉండగా.. ఎల్‌పీఎల్ రాకతో నగరం గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్‌గా మరింత బలోపేతం కానుంది.

హైదరాబాద్ మహానగరం గ్లోబల్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్‌గా మరో ఘనతను సాధించింది. ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ అమెరికా వెలుపల తన మొట్టమొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేషన్లను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సంస్థ నగరంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఐదు అంతస్తుల్లో సుమారు 3 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. రానున్న కొన్ని రోజుల్లో ఈ కేంద్రం ద్వారా 1500 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 2027 ప్రారంభం నాటికి తన శాశ్వత కార్యాలయంలోకి మారనుంది. ఈ ఏడాది చివరి నాటికి 680 నుండి 700 మంది ఉద్యోగులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు.. హైదరాబాద్ ప్రస్తుతం సుమారు 450 జీసీసీలకు నిలయంగా మారిందని చెప్పారు. ఇవి 1.3 లక్షల అత్యున్నత స్థాయి సాంకేతిక ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. కేవలం గత ఏడాది కాలంలోనే 80 కొత్త జీసీసీలు నగరానికి రావడం విశేషమని ఆయన వెల్లడించారు. ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ వంటి ఫార్చ్యూన్ 500 సంస్థ రాకతో హైదరాబాద్ స్థానం ప్రపంచ ఆర్థిక సేవల రంగంలో మరింత పదిలమైందని మంత్రి కొనియాడారు.

ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ సీటీవో గ్రెగ్ గేట్స్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడి అద్భుతమైన టాలెంట్ అని స్పష్టం చేశారు. ఈ కేంద్రం టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో అమెరికా కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తుందని ఎల్‌పీఎల్ ఇండియా హెడ్ రమేష్ కాజా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 32 వేల మంది అడ్వైజర్లకు సేవలందిస్తూ.. సుమారు 2.4 ట్రిలియన్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తున్న ఈ సంస్థకు హైదరాబాద్ కేంద్రం అత్యంత కీలకం కానుందని చెప్పారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • hyderabad
  • investment
  • Lpl Financial

Related News

World Ivf Day

IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి గాంధీ ఆస్పత్రి మరోసారి నిదర్శనంగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్‌లో ఉచితంగా చికిత్స పొందిన భువనగిరి జిల్లాకు చెందిన ఓ మ‌హిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. రవి, సౌమ్య దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd