HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Arranges Rs16 Crore Injection For Little Punarvika

Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 18-04-2026 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh garu met Punarvika's family after she received an injection today
Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ రూపంలో అందిన ఆపన్నహస్తం, పునర్జన్మను ప్రసాదించింది.

మాటలతో చెప్పలేని ఆవేదన నుంచి ఆనందభాష్పాలు రాల్చే క్షణాలకు ఈ కథ నిలువుటద్దం. అన్నగా అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, రూ.16 కోట్ల విలువైన జీవన సంజీవనిని అందించి, ఆ చిట్టి చెల్లెలి చిరునవ్వును కాపాడారు లోకేష్. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో మంత్రి లోకేష్ సమక్షంలోనే వైద్యులు శనివారం ఉదయం ఆ ఇంజెక్షన్‌ను పునర్వికకు అందించారు. ఈ ఘట్టంతో కొన్ని నెలలుగా సాగిన “సేవ్ పునర్విక” ఉద్యమం విజయవంతంగా ఫలించింది.

 

View this post on Instagram

 

A post shared by Nara Lokesh (@naralokesh)

కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగళ సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక. క్షవరం వృత్తి చేసుకుని జీవనం సాగించే సురేష్ కుమార్ కుటుంబానికి, తమ కుమార్తెకు ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలియడంతో మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. పుట్టిన ఆరు నెలలైనా చిన్నారిలో కదలికలు లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, హైదరాబాద్ రెయిన్‌బో ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ వైద్యులు పునర్వికకు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ సోకినట్టు నిర్ధారించారు. ఈ వ్యాధికి అమెరికా నుంచి తెప్పించే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఒక్కటే మార్గమని తేల్చిచెప్పారు.

pic.twitter.com/MeuMav5zBY

— Lokesh Nara (@naralokesh) April 18, 2026

దీంతో కన్నీరుమున్నీరైన ఆ తల్లిదండ్రులు, తమ కుమార్తెను కాపాడుకోవడానికి దాతల సహాయం కోరుతూ ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. “సేవ్ పునర్విక” పేరుతో సాగిన ఈ ప్రచారానికి లక్షలాది హృదయాలు స్పందించాయి. ఫిబ్రవరి నాటికి సుమారు రూ.10 కోట్ల విరాళాలు సమకూరాయి. అయినా, ఇంకా భారీ మొత్తంలో డబ్బు అవసరం కావడంతో, తల్లిదండ్రులు ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్‌ను సాయం కోరారు.

వారి విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన మంత్రి లోకేష్, చిన్నారి బాధ్యతను తాను తీసుకుంటానని, చికిత్సకు అవసరమైన పూర్తి సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, కేవలం ఆర్థిక సహాయం ప్రకటించడమే కాకుండా, చికిత్స ప్రక్రియను మొదటి నుంచి చివరి వరకు అన్నీ తానై పర్యవేక్షించారు. రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ను అమెరికా నుంచి హైదరాబాద్‌కు వేగంగా రప్పించేందుకు తన సిబ్బంది ద్వారా నిరంతరం సమన్వయం చేశారు. ఔషధ తయారీ సంస్థ నోవార్టిస్, రెయిన్‌బో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులతో మాట్లాడి ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రభుత్వ ధృవపత్రాలు, చెల్లింపులు, రవాణా వంటి అన్ని అడ్డంకులను తొలగించి, ఇంజెక్షన్ సకాలంలో అందేలా చూశారు.

చిన్నారికి ఇంజెక్షన్ ఇస్తున్న సమయంలో ఆసుపత్రిలోనే ఉన్న లోకేష్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏడుస్తున్న పునర్వికను ఎత్తుకుని లాలించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. తమ కుమార్తెకు జన్మనిచ్చింది తామైతే, పునర్జన్మ ప్రసాదించింది మంత్రి లోకేష్, దాతలని పునర్విక తల్లిదండ్రులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చేసిన సహాయాన్ని జీవితాంతం మరువలేమని, భవిష్యత్తులోనూ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులు, దాతలు, ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ వారు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • nara lokesh
  • Punarvika
  • punarvika news
  • Save Punarvika
  • SMA Type 1
  • telugu desam party
  • Zolgensma Injection

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MLA Chintamaneni Prabhakar goes on a rampage.

    TDP ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd