Drunk Driving: రెచ్చిపోతున్న మందుబాబులు, ఒకే రోజు 59 మంది జైలుకు
పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా మందుబాబులు రెచ్చిపోతూనే ఉన్నారు.
- By Balu J Published Date - 12:20 PM, Fri - 1 September 23

Drunk Driving: విశాఖ నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. చర్యల్లో భాగంగా విశాఖపట్నం మేజిస్ట్రేట్ 59 మంది నేరస్తులను హజరుపర్చగా, రెండు వారాల జైలు శిక్ష పడింది. జైలు శిక్ష సమయంలో భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోజూ ఒక గంట పాటు సమాజ సేవ చేయాలని ఆదేశించారు.
గురువారం మద్యం తాగి వాహనాలు నడిపిన 114 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆనందపురం, భీమిలి, వన్ టౌన్, న్యూపోర్టు, గాజువాక సహా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరస్తులను పట్టుకున్నారు. ఒక్కొక్కరికి 1000 నుండి 13,000 వరకు జరిమానాలు విధించారు.
నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనాలు నడిపే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా రోడ్డుపై ప్రయాణించే అమాయకుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
Also Read: Mega Hero: వారెవ్వా వరుణ్, స్టన్నింగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న మెగా హీరో!