Arjun Tendulkar: ‘నన్ను కుక్క కరిచింది బ్రో’.. అర్జున్ టెండూల్కర్ వీడియో వైరల్!
అర్జున్ టెండూల్కర్ ను కుక్క కరవడంతో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
- Author : Balu J
Date : 16-05-2023 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ మూడు వికెట్లు మాత్రమే తీసాడు. దీంతో కొన్ని మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంది. ఓ మ్యాచ్ లో ఒక్క ఓవర్ లో 30కుపైగా పరుగులు ఇవ్వడంతో ముంబై జట్టు ఆలోచనలో పడేలా చేసింది. ఇతర ఆటగాళ్లు రాణిస్తున్న అర్జున్ మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అర్జున్ బౌలింగ్ పై నెటిజన్స్ కూడా ఘోరంగా ట్రోలింగ్ చేశారు. ‘‘క్రికెట్ దేవుడు సచిన్ గౌరవాన్ని కాపాడాలేని కొడుకు’’ అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా అర్జున్ టెండూల్కర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను కుక్క కరిచిందని తోటి ఆటగాడితో చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే బౌలింగ్ వేసే చేతి వేళ్లనే కొరకడంతో అతను ఇవాళ జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. కుక్క కరిచిన విషయాన్ని అర్జున్ టెండూల్కరే తెలిపాడు. ఈ వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో వైరల్ అయ్యింది. లక్నో యువ ఆటగాళ్లను కలిసి హగ్ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ ఎలా ఉన్నారని ప్రశ్నించాడు. దానికి వారు బాగున్నామని, నీవు ఎలా ఉన్నావని అడిగారు. దానికి అర్జున్ ‘కుక్క కరిచింది’అని బదులిచ్చాడు. దానికి లక్నో ప్లేయర్ కుక్కనా? ఎప్పుడూ? అని అడగ్గా.. నిన్ననే అంటూ అర్జున్ సమాధానం చెప్పాడు.
అర్జున్ బౌలింగ్ హ్యాండ్ ఫింగర్స్‌ను కుక్క కొరికినట్లు తెలుస్తోంది. అయితే అర్జున్‌ను కరిచింది పెంపుడు కుక్కనా? వీధి కుక్కనా? అనే విషయంపై క్లారిటీ లేదు. లక్నో వికెట్ స్లోగా ఉండనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్‌ను బరిలోకి దింపాలని ముంబై భావించింది. అర్జున్ ను కుక్క కరవడంతో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
Mumbai se aaya humara dost. 🤝💙 pic.twitter.com/6DlwSRKsNt
— Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023
Also Read: Free English Course: ఆన్ లైన్ లో ఫ్రీ ఇంగ్లీష్ కోర్సులు.. వివరాలు ఇదిగో!