Free English Course: ఆన్ లైన్ లో ఫ్రీ ఇంగ్లీష్ కోర్సులు.. వివరాలు ఇదిగో!
ఇంగ్లీష్ మాట్లాడటం కొంత వరకు వచ్చినా.. వందశాతం కరెక్టర్ గా మాట్లాడలేరు.
- Author : Balu J
Date : 16-05-2023 - 11:48 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ తరం జనరేషన్ కు ఇంగ్లీష్ మాట్లాడటం కొంత వరకు వచ్చినా.. వందశాతం కరెక్టర్ గా మాట్లాడలేరు. తెలిసీ తెలియని పదాలు వాడేస్తూ మేనేజ్ చేస్తుంటారు. అలాంటివాళ్ల కోసం కొన్ని సంస్థలు ఉచితంగా ఆన్ లైన్ కోర్సులు అందిస్తున్నాయి. హైదారబాద్ లోని న్యూ ఈక్విటబుల్ అండ్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ ఏజెన్సీ (NEIEA) ఉచిత ఇంగ్లీష్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సును బ్యాచ్‌ల వారీగా రెండు నుండి మూడు నెలల పాటు అందించబడుతుంది.
ఇప్పటివరకు ఈ సంస్థ ఒక సంవత్సరంలో ఏడు బ్యాచ్‌లను పూర్తి చేసింది. ఫ్రీ కోచింగ్ కోసం తాజాగా 1400 కంటే ఎక్కువ మంది విద్యార్థులు కోర్సు కోసం నమోదు చేసుకున్నారు. 300 మంది విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికేట్‌లను అందుకున్నారు. NEIEA అనేది ఆధునిక సాంకేతిక సాధనాలను ఉపయోగించి విద్యలో ‘పునరుజ్జీవనం’ తీసుకురావాలని లక్ష్యంగా ముందుకు సాగుతుంది. నిపుణులు, విద్యావేత్తలు, అంకితభావంతో కూడిన టీచర్ల సాయంతో ఈ సంస్థ రన్ అవుతోంది. ఆసక్తి గల వ్యక్తులు 8867956115, 9731599267లను సంప్రదించవచ్చు లేదా వెబ్‌సైట్‌లో వివరాలను పొందవచ్చు.
Also Read: Shubman Gill: శతకాలతో చెలరేగుతున్న గిల్.. ఐపీఎల్ లోనూ సూపర్ ఫామ్