AP : కరెంట్ బిల్లు సాకు చెప్పి..వికలాంగుడికి పెన్షన్ ఇవ్వని జగన్ ప్రభుత్వం
గతేడాది శిబిరంలో 77 శాతం వికలాంగుడు అని ధ్రువీకరణ చేశారు. అప్పటి నుంచి అతడు వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే వస్తున్నాడు
- By Sudheer Published Date - 09:41 PM, Wed - 6 September 23

ఓ పక్క ఇది ప్రజల ప్రభుత్వం..ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వం..ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వం అని గొప్పలు చెపుతూ ప్రకటలు చేస్తుంటే..మరోపక్క ఈ ప్రభుత్వం మాకు వద్దు బాబోయ్ అంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఏ ప్రభుత్వం వేయని విధంగా ప్రజలఫై పన్నుల భారం మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విపక్షాలు మండిపడుతున్న..ప్రభుత్వ తీరు మారడం లేదు. ముఖ్యంగా వృద్దులు..వికలాంగుల పెన్షన్ల (Pensions) విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుడు అని చెప్పి డాక్టర్స్ సర్టిఫికెట్ ఇస్తే..ప్రభుత్వం మాత్రం అతని ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చెప్పి ప్రభుత్వ పెన్షన్ ఆపేసిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
తాజాగా రోడ్డు ప్రమాదం (Road Accident )లో రెండు కాళ్లు పోగొట్టుకొని..ఉన్న ఆస్థి అంత హాస్పటల్స్ లో ఖర్చు చేసి..చివరకు ప్రభుత్వ పెన్షన్ తో బ్రతుకుదాం అనుకుంటే..ఆ పెన్షన్ కూడా ఇవ్వకుండా జగన్ సర్కార్ (AP Govt) తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంట్లో కరెంట్ ఎక్కువగా వాడుతున్నారని చెప్పి వచ్చే పెన్షన్ ను అడ్డుకుంటున్న ఘటన విజయవాడ గ్రామీణ మండలం పైడూరిపాడు (Paidurupadu) లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామకోటేశ్వర రావుకు భార్య, ఇద్దరు పిల్లలు. వెల్గిండ్ కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపే శ్రీరామకోటేశ్వర రావు (Sri Rama Koteswara Rao).. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు, పక్కటెముకలు విరిగిపోవడంతో పాటు గూని కూడా జారిపోయింది. దీంతో పలు హాస్పటల్స్ లలో చికిత్స చేయించి ఉన్న ఆస్థిని అమ్ముకున్నారు. అయినప్పటికీ శ్రీరామకోటేశ్వర రావు ఆరోగ్యం కుదుటపడలేదు. డబ్బులు లేక ఉన్న ఒక్క ఇళ్లును కూడా అమ్మేశారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా అతడి కాళ్లు మెరుగు పడలేదు. కనీసం నడవడానికి కూడా లేకుండా పోయింది. మందుల కోసం నెలకు సుమారు 5 వేల ఖర్చు చేస్తున్నారు.
Read Also : Aloo Paratha: పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆలు పరోటా.. ఇంట్లోనే చేసుకోండిలా?
ఇక కుటుంబ పోషణ భారం కావడం తో ప్రభుత్వ పెన్షన్ తోనైనా కాస్త తోడవుతుందని భావించాడు. గతేడాది శిబిరంలో 77 శాతం వికలాంగుడు అని ధ్రువీకరణ చేశారు. అప్పటి నుంచి అతడు వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే వస్తున్నాడు. ఏడాది నుంచి పింఛన్ కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తొలుత కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని తిరస్కరించారు. ఇప్పుడేమో రకరకాల కారణాలు చెపుతున్నారు. సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే.. కలెక్టరేట్ లోని స్పందనలో ఫిర్యాదు చేయమన్నారని బాధితుడు చెపుతున్నాడు. ఇలా తిప్పుతూనే ఉన్నారు తప్పితే పింఛన్ మాత్రం రావడం లేదని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆయన కోరుతున్నాడు.