Aloo Paratha: పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆలు పరోటా.. ఇంట్లోనే చేసుకోండిలా?
మామూలుగా పూరీ లేదా చపాతీ పరోటా వంటి చేసినప్పుడు తప్పకుండా వాటికి సపరేట్ గా కర్రీ కూడా చేయాలి. అటువంటి సమయంలో చాలామంది సమయం లేదు అని
- By Anshu Published Date - 09:10 PM, Wed - 6 September 23

మామూలుగా పూరీ లేదా చపాతీ పరోటా వంటి చేసినప్పుడు తప్పకుండా వాటికి సపరేట్ గా కర్రీ కూడా చేయాలి. అటువంటి సమయంలో చాలామంది సమయం లేదు అనిఏదో చిన్న చిన్న వంటకాలు ఫాస్ట్గా చేసుకుని తింటూ ఉంటారు. ముఖ్యంగా పరోటాలోకి నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే కర్రీ ఉపయోగం లేకుండా ఆలు పరాటా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆలూ పరోటా కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు – 3
ఉల్లిపాయి ముక్కలు – 1/4 కప్పు
పచ్చిమిర్చి – 2
వాము – 10 గింజలు
ఉప్పు – 1/2 చెంచా
కొత్తిమీర సన్నగా తరిగినది – కొద్దిగా
నూనె లేక బటర్ – 1/4 కప్పు
చపాతి పిండి – 1 కప్పు
ఆలూ పరోటా తయారీ విధానం:
ముందుగా కుక్కర్‌లో సగానికి కోసిన ఆలుగడ్డలు ఉడికించి పొట్టుతీసి ప్రక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిలో చిటికెడు ఉప్పు, చెంచా నూనె వేసి పరోటాల కొరకు మెత్తగా పిండి కలుపుకోవాలి. ఉల్లిముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వాము, ఉప్పు, కారం కొత్తిమీర తరుగు అన్నీ కలుపుకుని బాగా అదిమిన ఆలుగడ్డల ముద్దలో కలుపుకోవాలి. ఈ ముద్దని చిన్న పూరీ సైజులో ఒత్తుకున్న పరోటా మధ్యలో పెట్టి ముట్టు మూసివేసి ఆ ముద్దను చేతితో బిళ్ళలా అదిమి అప్పడాల కర్రతో మెల్ల మెల్లగా బత్తుకుని పెనంపై చిన్నమంటతో దోరగా కాలేలా నూనె లేదా బటర్ రాస్తూ కాల్చుకోవాలి. ఈ ఆలూ పరోటాలు వేడిగా తింటే రుచిగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీటిని ఏ కూర లేకుండా కూడా తినవచ్చు.