Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై 29 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.
- By Prasad Published Date - 04:19 PM, Tue - 22 November 22

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై 29 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. 70,163 మంది భక్తులు దర్శనం కోసం తిరుమలకు రాగా, 31,489 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా భక్తులు సమర్పించిన కానుకలు రూ. 5.22 కోట్లు వచ్చాయని తెలపింది.