World Economic Forum : జనవరి 20 నుంచి దావోస్ సదస్సు..
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఇంటర్ పోల్, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీఓ అధికారులు హాజరవుతారు.
- By Latha Suma Published Date - 09:32 PM, Sat - 28 December 24
World Economic Forum : జనవరి 20 నుంచి 24 వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో నైతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం, భూతపం వంటి ఉమ్మడి సవాళ్లు, అధిక రుణ భారం, తక్కువ వృద్ధిరేటు నుంచి బయట పడే మార్గాలపై డబ్ల్యఈఎఫ్ సదస్సులో చర్చిస్తారు. ఏఐ, క్వాంటం టూ ఎనర్జీ టెక్, బయోటెక్, హెల్త్ టెక్ వంటి ఇంటర్ కనెక్టెడ్ టెక్నాలజీస్‌తో ఉత్పాదకత పెంపు, జీవన ప్రమాణాల పెంపుదల తదితర అంశాలపై చర్చిస్తారు.
2025 జనవరి 20 నుంచి ఐదు రోజుల పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఇంటర్ పోల్, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీఓ అధికారులు హాజరవుతారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు- తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్ సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటారు.
కాగా, ఈ సదస్సుకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, సీఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్, కే రామ్మోహన్ నాయుడు, జయంత్ చౌదరి హాజరవుతారు. వీరితోపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), ఏ రేవంత్ రెడ్డి (తెలంగాణ)తోపాటు వందలాది మంది ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు.
ఇక ఈ సదస్సులో దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధిపతులు కూడా పాల్గొంటారని భావిస్తున్నారు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీల భవిష్యత్ తరం ప్రతినిధులు, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, విప్రో నుంచి రిషాద్ ప్రేమ్ జీ, రెన్యూ సుమంత్ సిన్హా, పేటీఎం విజయ్ శేఖర్ శర్మ, సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా, రిలయన్స్, టాటా సన్స్, అదానీ గ్రూప్, బిర్లా, భారతీ, మహీంద్రా, గోద్రేజ్, జిందాల్, బజాజ్, వేదంతా గ్రూపు సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొంటారు.
Read Also: Tammareddy : తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు