Corona Update: రికార్డు స్థాయిలో భారీగా తగ్గని కరోనా కేసులు
- Author : HashtagU Desk
Date : 15-02-2022 - 11:23 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్‌లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 27,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటి వరకు 4,26,65,534 మందికి కరోనా సోకగా, 4,17,60,458 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,09,358 మంది బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా పాజిటివిటీ రేటు 2.23 శాతంగా ఉండగా, ఇప్పటి వరకూ దేశంలో 1,72,95,87,490 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ఏపీలో కూడా క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటలలో 434 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా నుండి 4,636 మంది కోలుకున్నారు. ఏపీలో కరోనాతో నిన్న ఒకరు మరణించారు. ఇక ఏపీలో ఇప్పటివరకు 23,13,212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 22,83,788 మంది కరోనా నుండి కోలుకోగా, 14,698 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ప్రస్తుతం ఏపీలో 14,726 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో గడచిన 24 గంటల్లో 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 2,387 మంది కరోనా నుంచి కోలుకోగా, నిన్న తెలంగాణలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,84,062 పాజిటివ్ కేసులు నమోదవగా, 7,70,047 మంది కరోనా నుండి కోలున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా ఉండడం గమనార్హం.