Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం..!
UPI కోసం థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP) కావడానికి పేటీఎం (Paytm) పేరెంట్ One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా RBI శుక్రవారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని కోరింది.
- By Gopichand Published Date - 08:30 PM, Fri - 23 February 24
Paytm: UPI కోసం థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP) కావడానికి పేటీఎం (Paytm) పేరెంట్ One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా RBI శుక్రవారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని కోరింది. నిబంధనల ప్రకారం.. TPAP UPI ఛానెల్‌గా మారడంతో Paytm యాప్, UPI కార్యకలాపాలు మునుపటిలానే కొనసాగుతాయి. ఇంతలో యాక్సిస్ బ్యాంక్ తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యెస్ బ్యాంక్ కూడా పేటిఎమ్ యుపిఐ వ్యాపారం కోసం టిపిఎపిగా మారడానికి ఎన్పిసిఐకి దరఖాస్తు చేశాయి.
Paytm యాప్‌లో UPI కార్యకలాపాలను కొనసాగించవచ్చా లేదా అనే దాని గురించి NPCI అవకాశాలను అన్వేషిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) NPCIని దీన్ని కోరింది. Paytm ‘థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్’ (TPAP)గా మారడం ద్వారా UPI కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటోంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ దీని కోసం అభ్యర్థించిందని ఆర్బీఐ తెలిపింది. మార్చి 15, 2024 తర్వాత తన కస్టమర్ ఖాతాలు, వాలెట్లలో డబ్బును స్వీకరించకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది.
Paytm పేమెంట్స్ బ్యాంక్ నిర్వహించే హ్యాండిల్‌ను ఉపయోగించి UPI కస్టమర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజిటల్ చెల్లింపులు చేయడానికి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుండి Paytm ‘థర్డ్ పార్టీ యాప్’ ప్రొవైడర్‌గా మారే అవకాశం ఉందని RBI ప్రకటనలో తెలిపింది. UPI వ్యాపారం కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా వ్యవహరించడానికి యాక్సిస్ బ్యాంక్‌తో పాటు Paytm NPCIకి దరఖాస్తు చేసింది. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యెస్ బ్యాంక్ కూడా పేటిఎమ్‌తో దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Tillu Square Runtime : టిల్లు స్క్వేర్ పర్ఫెక్ట్ ప్లాన్.. రన్ టైం కూడా అందులో భాగంగానే..!
NPCI One97 కమ్యూనికేషన్స్‌కు థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ హోదాను మంజూరు చేస్తే ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు.. ‘@paytm’ హ్యాండిల్ ఎలాంటి అంతరాయం లేకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్ నుండి కొత్త బ్యాంకుల కన్సార్టియంకు మార్చబడుతుంది. థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్‌గా ఇప్పటికే ఉన్న వినియోగదారులందరినీ కొత్త హ్యాండిల్‌కి తరలించే వరకు Paytm కొత్త యూజర్లను జోడించదు. ఇతర బ్యాంకులకు ‘@Paytm’ హ్యాండిల్‌లను సజావుగా బదిలీ చేయడానికి, NPCI 4-5 బ్యాంకులను చెల్లింపు సేవా ప్రదాతలు (PSPలు)గా ధృవీకరించవచ్చు.
We’re now on WhatsApp : Click to Join
Paytm QR కోడ్‌ని ఉపయోగించే వ్యాపారుల కోసం One97 కమ్యూనికేషన్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ PSP బ్యాంకులతో (Paytm పేమెంట్స్ బ్యాంక్ కాకుండా) సెటిల్మెంట్ ఖాతాలను తెరవవచ్చని ప్రకటన పేర్కొంది. UPI హ్యాండిల్ మైగ్రేషన్ UPI హ్యాండిల్ ‘@Paytm’ని కలిగి ఉన్న కస్టమర్లు, వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర హ్యాండిల్స్ ఉన్న కస్టమర్లు UPIతో కొనసాగవచ్చు. ఎటువంటి చర్య అవసరం లేదు.
Related News
MDH- Everest: భారత్‌లో రూట్ మార్చిన మసాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!
సింగపూర్, హాంకాంగ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదాల్లో కూరుకుపోయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల వేడి దేశంలోని అన్ని మసాలా కంపెనీలకు చేరింది.