Tillu Square Runtime : టిల్లు స్క్వేర్ పర్ఫెక్ట్ ప్లాన్.. రన్ టైం కూడా అందులో భాగంగానే..!
Tillu Square Runtime సిద్ధు జొన్నలగడ్డ సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజ్ అవుతుండగా
- Author : Ramesh
Date : 23-02-2024 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
Tillu Square Runtime సిద్ధు జొన్నలగడ్డ సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజ్ అవుతుండగా సినిమా గురించి బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అందరికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జైట్ మెంట్ ఉంది. సిద్ధు తో పాటుగా అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాకు హైలెట్ అంశాల్లో ఒకటని తెలుస్తుంది.
టిల్లు స్క్వేర్ సినిమ థియేట్రికల్, డిజిటల్ బిజినెస్ ల విషయంలో దూకుడు చూపిస్తున్న విషయం తెలిసిందే. సినిమా థియేట్రికల్ వెర్షన్ ఒక 35 కోట్లు డిజిటల్ వెర్షన్ 30 కోట్ల దాకా రేటు పలికినట్టు టాక్. అయితే ఇదంతా సినిమాపై ఉన్న బజ్ వల్లే అని తెలుస్తుంది.
ఇక లేటెస్ట్ గా టిల్లు స్క్వేర్ సినిమా నుంచి మరో క్రేజీ న్యూస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఈ సినిమా కేవలం 2 గంటల రన్ టైం తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. 2 గంటల 1 నిమిషం డ్యురేషన్ తో ఈ సినిమా వస్తుందని చెబుతున్నారు. మొత్తానికి టిల్లు స్క్వేర్ రన్ టైం తో కూడా ఎక్కువ లెంగ్త్ కాకుండా అదరగొట్టబోతుందని తెలుస్తుంది.
Also Read : NTR Devara : దేవరకు సమస్యగా మారిన అతను.. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్..!