TG Assembly : రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ..వాటిని గౌరవించాలి: సీఎం రేవంత్ రెడ్డి
అవగాహన లేని వాళ్లు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉందా? అని నేను అడుగుతున్నాను. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నాటి మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగం ఉందా? అన్నారు.
- By Latha Suma Published Date - 01:25 PM, Sat - 15 March 25

TG Assembly : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని.. వాటిని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిదని అన్నారు. మాది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇది ప్రజా పాలన. మా విధానం. మా ఆలోచనలు.. మేం ప్రజలకు చేసిన పనులు మాత్రమే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తాం. అవగాహన లేని వాళ్లు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉందా? అని నేను అడుగుతున్నాను. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నాటి మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగం ఉందా? అన్నారు.
Read Also: Tanuk : మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా: సీఎం చంద్రబాబు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ వ్యవస్థపై నమ్మకం లేదు. మహిళా గవర్నర్‌ను అవమానించారు.. ఆ తప్పు మేం చేయం. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది. గవర్నర్ ప్రసంగంలో సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది అని రేవంత్ అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు. 2023లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలనుకున్నారు. కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయి. వాటిని మనం గౌరవించాలి. ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తులు కాదు. బలహీన వర్గాలకు చెందిన మహిళా గవర్నర్‌ను గత ప్రభుత్వం అవహేళన చేసింది. మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అని.. గాంధీ భవన్ లో మాట్లాడినట్టు ఉంది అని బీఆర్ఎస్ వాళ్ళు గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో అన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారా.. అజ్ఞానమే.. తన విజ్ఞానం అనుకుంటున్నారు అని బీఆర్ఎస్‌ను ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన స్పీచ్ నే గవర్నర్ ప్రసంగిస్తారని సీఎం తెలిపారు.
Read Also: 214 Hostages Killed: 214 మంది బందీలను చంపాం.. ‘రైలు హైజాక్’పై బీఎల్ఏ ప్రకటన