HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy Counter To Brs Leaders

CM Revanth Reddy : ఇండియా పాకిస్తాన్ బార్డర్‌లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు

  • Author : Kavya Krishna Date : 13-02-2024 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth
Revanth

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తుంటే.. అంతే ధీటుగా బీఆర్‌ఎస్‌ నేతలు తమ స్వరం వినిపిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం పూనుకుందని, అందుకోసం రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారన్నారు. వెంకటస్వామి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, రీడిజైన్ పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచిందని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారని, ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా? అని ఆయన దుయ్యబట్టారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారని సీఎం రేవంత్‌ బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారని, కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని.. ఈ నేపథ్యంలో దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిందని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చిందని, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉందని సీఎం రేవంత్‌ అన్నారు. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దామని శాసన సభ్యులనుద్దేశించి సీఎం రేవంత్‌ అన్నారు. కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి.. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండన్నారు. మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండని, తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండంటూ సీఎం రేవంత్‌ వ్యంగ్యస్ర్తాలు సంధించారు. జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు.

తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..? అని ఆయన అన్నారు. కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారని, కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా అంటూ రేవంత్‌ చురకలు అంటించారు. మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే… హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉందని, రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారని, కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దాం అంటూ బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.

Read Also : Harish Rao : మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • breaking news
  • CM Revanth Reddy
  • kcr
  • Latest News
  • Medigadda Project
  • telugu news

Related News

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ కు ఉందా ? – బండి సంజయ్ సూటి ప్రశ్న

కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు

  • CM Revanth Reddy

    రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

  • T-SAT

    లా సెట్ పరీక్ష అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీ-శాట్‌!

  • Revanth Harish

    Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?

  • BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

    కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు – సీఎం రేవంత్

Latest News

  • అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. మెగా- అల్లు కుటుంబాల సందడి!

  • Telangana Municipal Polls Results : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్

  • బంగ్లాదేశ్‌లో కొత్త శకం.. భారత్-బంగ్లా సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి?!

  • తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ !

Trending News

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd