Tomato Price: తెలుగు రాష్ట్రాల నుంచి టమోటా కొనుగోలు చేయనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్నాయి. కిలో 120 పైగానే పలుకుతుంది. దీంతో సామాన్యులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 12-07-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
Tomato Price: దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్నాయి. కిలో 120 పైగానే పలుకుతుంది. దీంతో సామాన్యులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా టమోటా ధరలు పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో టమోటా సరఫరా లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి టమోటా కొనుగోలు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టొమాటోలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
రిటైల్ ధరలు గరిష్ఠంగా పెరిగిన ప్రధాన వినియోగ కేంద్రాల్లో టొమాటోలను పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రలోని మండిస్ నుండి టమోటాలను తక్షణమే కొనుగోలు చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (NAFED) మరియు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF)ని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
Read More: Ashish Vidyarthi : 58 ఏళ్ళ వయసులో రెండో భార్యతో హనీమూన్‌కి వెళ్లిన ఆశిష్ విద్యార్ధి..