Ashish Vidyarthi : 58 ఏళ్ళ వయసులో రెండో భార్యతో హనీమూన్‌కి వెళ్లిన ఆశిష్ విద్యార్ధి..
2022లో తన మొదటి భార్య రాజోషితో విడాకులు తీసుకున్న ఆశిష్ విద్యార్ధి 2023లో రూపాలి బారువా(Rupali Barua) అనే బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ని పెళ్లి చేసుకున్నారు.
- Author : News Desk
Date : 12-07-2023 - 7:38 IST
Published By : Hashtagu Telugu Desk
గుడుంబా శంకర్, పోకిరి(Pokiri) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఆశిష్ విద్యార్ధి(Ashish Vidyarthi). ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటిస్తూనే వస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ.. ఇలా దాదాపు 11 భాషల్లో 300 లకు పైగా సినిమాల్లో నటించారు ఆశిష్ విద్యార్ధి. 2022లో తన మొదటి భార్య రాజోషితో విడాకులు తీసుకున్న ఆశిష్ విద్యార్ధి 2023లో రూపాలి బారువా(Rupali Barua) అనే బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ని పెళ్లి చేసుకున్నారు.
58 ఏళ్ళ వయసులో 33 ఏళ్ళ మహిళను ఆశిష్ విద్యార్ధి ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం వీరిద్దరూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట హనీమూన్ కి వెళ్ళింది. ఆశిష్ విద్యార్ధి తన రెండో భార్య రూపాలి బారువాతో కలిసి ఇండోనేషియాలోని బాలికి హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు.అక్కడ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ పిక్ వైరల్ గా మారింది.
58 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకొని హనీమూన్ కి వెళ్లడంతో ఆశిష్ విద్యార్థిని ముసలోడే కానీ మహానుభావుడు, అదృష్టవంతుడు, ఈ ఏజ్ లో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది వీళ్ళకి సెకండ్ హనీమూన్ అని, గతంలో సింగపుర్ కి కూడా హనీమూన్ ట్రిప్ కి వెళ్లారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆశిష్ సినిమాలతోనే కాక తన యూట్యూబ్ వ్లాగ్స్ తో కూడా పేరు తెచ్చుకున్నాడు.
Also Read : Mahesh Babu : ‘ఫిదా’ సినిమాని మహేష్ బాబు వదులుకున్నాడు తెలుసా? ఎందుకంటే..?