HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Case Filed On Ktr Over Comments On Cm Revanth

KTR: ఆ సెక్షన్ల కింద కేటీఆర్‌పై కేసు నమోదు

KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Author : Kavya Krishna Date : 14-06-2025 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
There is nothing wrong with writing a letter to the party leader..internal matters..should be discussed internally: KTR
There is nothing wrong with writing a letter to the party leader..internal matters..should be discussed internally: KTR

KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. బాల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘‘కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై రెచ్చగొట్టేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. సీఎం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆయన పరువు దెబ్బతీసేలా బహిరంగంగా ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి’’ అని పేర్కొన్నారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్‌ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపించారు.

Fee-Hike : ఇంజినీరింగ్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి కొరడా

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకాలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇదే విషయాన్ని బాల్మూరి వెంకట్‌ పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు. ‘‘ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కేటీఆర్‌ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది చట్టపరంగా అనుమతించదగ్గది కాదు’’ అని ఆయన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. పూర్తిగా ఫిర్యాదును పరిశీలించిన తర్వాత, సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలకు దిగారు. అందులో భాగంగా భారతీయ శిక్షాసమితి (భారతీయ న్యాయ వ్యవస్థ – BNS)లోని సెక్షన్ 353(2), సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు ప్రజాసేవలో ఉన్న అధికారులపై ఉద్దేశపూర్వకంగా ఆవేదన కలిగించే చర్యలు, అనుచిత ప్రవర్తనలకు సంబంధించినవిగా పేర్కొనబడినవి.

Advance Tax Alert: అడ్వాన్స్ టాక్స్ పరిధిలోకి వ‌చ్చేవారు ఎవ‌రు? ఈనెల 15లోపు అర్జెంట్‌గా ఈ ప‌ని చేయాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • cyber crime
  • hyderabad news
  • ktr
  • Political Controversy
  • revanth reddy
  • telangana

Related News

Ktr Comments Revanth

నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన

రాహుల్ గాంధీని తాను కొత్తగా ఏం అనలేదని, గతంలో రేవంత్ చెప్పిన మాటలనే తిరిగి అన్నానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫైరవ్వడంపై ఆయన స్పందించారు. 'రాహుల్ పప్పు కాదు ముద్ద పప్పు అని గతంలో రేవంత్ అన్నాడు

  • PV Huzurabad JAC Leaders Demand Formation of District In name Of PV Narasimha Rao

    తెలంగాణ లో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం.. పీవీ నరసింహారావు పేరు ఖరారు ?

  • The Raja Saab

    ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల‌కు గుడ్ న్యూస్‌!

  • KTR Welcomed With YSRCP Flags

    కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు..

  • Kavithavsbrs

    కవిత కు బిఆర్ఎస్ కు ఎక్కడ చెడింది?

Latest News

  • ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు?.. ఎంతసేపటికి తింటే మంచిది?

  • సిరిసంపదలు కలగాలంటే.. ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఇవే..!

  • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

  • శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలేంటి?

Trending News

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd