HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cap Gemini To Create 20000 Jobs In Visakhapatnam Minister Lokeshs Key Proposal

విశాఖలో క్యాప్‌ జెమిని 20 వేల ఉద్యోగాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2026 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Capgemini మంత్రి నారా లోకేష్..చెప్పిన మాటను నిలబెట్టుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖను రాబోయే పదేళ్లలో ఆ స్థాయికి చేరుస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఆ దిశగా ప్రయత్నాలు స్పీడప్ చేశారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని సీఈవో ఐమాన్‌ ఏజత్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో క్యాప్ జెమిని సంస్థ ఏర్పాటుపై చర్చించారు. ఈ సంస్థకు ఇప్పటికే విశాఖ మధురవాడ ఐటీ పార్క్‌ హిల్ – 1పై 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అడివివరం, ఆనందపురం పరిధిలో రెండు చోట్ల సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించారు.

ఈ సమావేశంలో విశాఖకున్న అడ్వాంటేజ్, అద్భుతమైన మౌలిక వసతులు,లోకల్ టాలెంట్ గురించి లోకేష్ వివరించిన తీరు ఆ సంస్థ ప్రతినిధులను ఆకర్షించింది. ఈ క్యాంపస్ ద్వారా ప్రారంభంలోనే సుమారు 4,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏఐ (AI), క్లౌడ్ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో ఇక్కడ సేవలు అందించనున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెంట్రల్ పార్క్ సమీపంలో ఓ భవనాన్ని పరిశీలించారు.

వై నాట్ వైజాగ్‌..అనే నినాదంతో లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తున్నాయి. ఇప్పటికే TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు విశాఖకు రాగా, ఇప్పుడు IBM, క్యాప్‌జెమిని కూడా తోడవ్వడంతో విశాఖ ఐటీ రంగంలో దూసుకుపోతుంది. ఒకప్పుడు అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీన్ మారింది.కంపెనీలు అడిగిన వెంటనే స్థల పరిశీలన, భూ కేటాయింపులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఐటీ కంపెనీలకు అవసరమైన టాలెంట్ పూల్‌ను సిద్ధం చేసేందుకు విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు ఊతమిస్తూ, ఏపీని నెక్స్ట్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aiman Ezzat
  • Andhra Pradesh Investments
  • AP IT Development
  • AP IT hub
  • Bhogapuram Airport
  • Capgemini
  • Global Capability Center
  • Keshav Murugesh
  • Minister Nara lokesh
  • Visakhapatnam

Related News

Murder 1

Murder : భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. వ‌డ‌దెబ్బ అంటూ డ్రామా..!

ఇటీవ‌ల కాలంలో భార్య చేతిలో భ‌ర్తలు హ‌త్య‌కు గుర‌వుతున్నారు. వివాహేత‌ర సంబంధాల కార‌ణాల‌తోనే ప‌లు హ‌త్య‌లు జ‌రిగిన సంగంతి తెలిసింది. తాజాగా వ‌డ‌దెబ్బ ముసుగులో ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను హ‌త్య చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుపత్రికి తీసు

  • Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh

    Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd