Mumbai Indians: ముంబైకి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా ?
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కు 15వ సీజన్ లో ఇప్పటి వరకు గెలుపు అందలేదు. ఛాంపియన్ టీమ్ అయిన ముంబై ఇలా ఆడుతోందని ఎవ్వరూ ఊహించలేదు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఐదు గార్లు ట్రోఫీ విజేతగా నిలిచింది.
- By Naresh Kumar Published Date - 12:16 PM, Fri - 15 April 22

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కు 15వ సీజన్ లో ఇప్పటి వరకు గెలుపు అందలేదు. ఛాంపియన్ టీమ్ అయిన ముంబై ఇలా ఆడుతోందని ఎవ్వరూ ఊహించలేదు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఐదు గార్లు ట్రోఫీ విజేతగా నిలిచింది. నిలకడకు మారుపేరుగా ఉన్న రోహిత్ సేనకు ఈ సీజన్ లో ఏదీ కలిసి రావడం లేదు. అనవసర తప్పిదాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఎప్పుడూ టాప్‌లో ఉండే ముంబై ఇండియన్స్ జట్టును ఇలా చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ధోనీ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికీ ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు. నమ్మడమే కాదు.. ఇంతకుముందు ఐపీఎల్ 2014 సీజన్ లో కూడా ఇలాగే జరిగినదని గుర్తు చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్-2014 సీజన్ లో కూడా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనా కూడా ఆ తరువాత వరుస విజయాలు సాధించి దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.. అయితే ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంకా 9 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ 9 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంటే మాత్రం వారి ప్లేఆఫ్ అవకాశాలు కష్టంగా మారుతాయి.పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉన్న ముంబై.. -1.072 నెట్ రన్ రేట్ తో మైనస్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక రాబోయే ప్రతి మ్యాచ్ ఆ జట్టుకు కీలకమే. 8 మ్యాచులు గెలిస్తేనే ముంబై ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఆ జట్టుకు మిగిలి ఉన్న మ్యాచ్ లు వరుసగా ఏప్రిల్ 16న లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 21న చెన్నై సూపర్‌కింగ్స్, ఏప్రిల్ 24న లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 30న రాజస్థాన్ రాయల్స్, మే 6న కోల్‌కతా నైట్‌రైడర్స్, మే 12న చెన్నై సూపర్‌కింగ్స్, మే 17న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 21న ఢిల్లీ కేపిటల్స్‌తో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆడే ప్రతి మ్యాచ్ కూడా ఫైనల్ లా ఆడితేనే ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది.
Photo: Twitter