KCR : ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లోనే కేసీఆర్ – బిఆర్ఎస్
KCR : ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసులో స్థానం కోల్పోరు
- By Sudheer Published Date - 01:30 PM, Sun - 25 May 25

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఫ్యామిలీ ఇష్యూ (KCR Family Issue) ఆసక్తి రేపుతున్న సంగతి తెలిసిందే. కవిత..కేసీఆర్ కు లేఖ రాయడం..అందులో పలు అంశాలు ప్రస్తావించడం..అలాగే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కీలక ఆరోపణలు చేయడం , ఇటు కేటీఆర్ (KCR) సైతం పరోక్షంగా కవితకు హెచ్చరికలు జారీచేయడం తో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్‌ను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడిగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ అధికారిక ట్వీట్ చేసింది. “ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసులో స్థానం కోల్పోరు” అంటూ బీఆర్ఎస్ పేర్కొంది. “తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ మాత్రమే” అనే నినాదంతో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
Sirajs Terror Links: రాజాసింగ్ వీడియోకు సిరాజ్ కౌంటర్.. సిరాజ్‌కు ఓ అధికారి ప్రోత్సాహం.. ఎవరతడు ?
ఈ ట్వీట్ ద్వారా బీఆర్ఎస్ తన అధినేతకు మద్దతుగా గళమెత్తడంతో పాటు, పార్టీ బలంగా ఉందని సంకేతాలు పంపే ప్రయత్నం చేసింది. కేసీఆర్‌ను తిరస్కరించేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన పాలన, తెలంగాణ కోసం చేసిన కృషి ప్రజల హృదయాల్లో నిలిచిపోయినదిగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. పార్టీ అంతర్గత కలహాలు, విమర్శల మధ్య వచ్చిన ఈ సందేశం భవిష్యత్ రాజకీయ దిశను ప్రభావితం చేసేలా కనిపిస్తోంది.
ఎవరు ఎన్నిరకాలుగా కుట్రలు చేసినా… ఎన్ని దుష్ప్రచారాలు సాగించినా..
తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు ఒకడే..
తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ మాత్రమే! pic.twitter.com/ABOcDVyraw— BRS Party (@BRSparty) May 25, 2025