AP BJP : నేడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న పురంధేశ్వరి
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు (గురువారం) రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాధ్యతలు
- Author : Prasad
Date : 13-07-2023 - 9:02 IST
Published By : Hashtagu Telugu Desk
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు (గురువారం) రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ఉదయం 10.55 నుంచి 11.10 గంటల మధ్య ఆమె బాధ్యతలు స్వీకరించి 11.15 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశానికి హాజరుకానున్నరు మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర, జాతీయ నాయకులు సోము వీర్రాజు, ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, సునీల్ దేవధర్, వై సత్యకుమార్, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ తదితర నేతలు పాల్గొంటారు.