Bandi Sanjay Arrest: బీఆర్ఎస్ పని ఖతం, బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ నేతల ఆగ్రహం
- Author : hashtagu
Date : 05-04-2023 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Arrest)అరెస్టుపై ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. అన్ని పరిణామాలను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కాలం చెల్లిందన్నారు.
బీజేపీ ఏపీ ప్రధానకార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డికూడా బండిసంజయ్ అరెస్టుపై స్పందించారు. అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తెలుగురాష్ట్రాల్లో కామన్ అయ్యిందన్నారు. తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు.