Bandi Sanjay: బీజేపీ కార్యకర్త పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన బండి సంజయ్
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త
- By Praveen Aluthuru Published Date - 09:25 PM, Thu - 22 June 23

Bandi Sanjay: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త వంచ శ్రీకాంత్ రెడ్డి ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బండి సంజయ్ మృతుడి స్వస్థలాని వెళ్లి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఆ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో దేవుడు అతని కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని కోరుకున్నారు బండి సంజయ్.
రామడుగు మండలం బీజేపీ కార్యకర్త వంచ శ్రీకాంత్ రెడ్డి ప్రమాదవశాత్తు కరెంటు షాక్ వల్ల అకాల మరణం చెందడం దిగ్భ్రాంతికరం. తన మరణ వార్త తెలిసిన వెంటనే, వారి ఇంటికి వెళ్ళి, పార్థీవ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఈ కష్ట సమయంలో దేవుడు అతని కుటుంబానికి… pic.twitter.com/YxByEbkWXU
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 22, 2023
బండి సంజయ్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ లాంటి అంకితభావం గల కార్యకర్తను కోల్పోవడం పార్టీకి, వ్యక్తిగతంగా నాకూ తీరనిలోటన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు.
Read More: Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?