Cabinet Meeting: మహిళలకు శుభవార్త చెప్పనున్న ఢిల్లీ ప్రభుత్వం!
ఢిల్లీలోని మహిళలకు 2100 రూపాయలు ఇస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి మహిళలకు రూ.2500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని ప్రకటించింది.
- Author : Gopichand
Date : 20-02-2025 - 2:01 IST
Published By : Hashtagu Telugu Desk
Cabinet Meeting: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇవాళ రాంలీలా మైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఢిల్లీలోని మహిళలకు 2500 రూపాయలను అందజేసే ప్రకటన త్వరలో జరగనున్న క్యాబినెట్ మీటింగ్‌లో (Cabinet Meeting) చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఎం 100 రోజుల ప్రణాళిక ఏమిటో? ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా తీసుకోబోయే 5 పెద్ద నిర్ణయాలేంటో తెలుసుకుందాం.
స్వచ్ఛమైన నీరు
ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడమే రేఖా గుప్తా మొదటి పని. దీనిపై నేటి కేబినెట్ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. స్వచ్ఛమైన నీటి పేరుతో గత ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మురికి నీటితో ఢిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.
మహిళలకు శుభవార్త
ఢిల్లీలోని మహిళలకు 2100 రూపాయలు ఇస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి మహిళలకు రూ.2500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని ప్రకటించింది. మార్చి 8న అంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రూ.2500 అందజేస్తామని ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రకటించవచ్చు.
Also Read: HMIL : భారతదేశం అంతటా హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా పథకాన్ని ప్రారంభించడం
ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా పథకాన్ని ప్రారంభించడం అనేది నేటి క్యాబినెట్ సమావేశంలో తీసుకోగల మరో ముఖ్యమైన నిర్ణయం. ఈ పథకం కింద ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స సౌకర్యాలు కూడా ఇవ్వనున్నారు. అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి.
చెత్త కుప్పలను తొలగించే ప్రచారం
ఢిల్లీలోని పలు చోట్ల చెత్త కుప్పలను తొలగించే ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఈరోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రకటన కూడా వెలువడవచ్చు. దీంతో దేశ రాజధాని ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టనున్నారు. మురుగు కాలువలు. మురికి కాలువలను శుభ్రపరిచే ప్రచారాన్ని కూడా త్వరలో ప్రారంభించవచ్చు.
స్వచ్ఛ యమునా లక్ష్యం
కలుషిత యమునా నదిని శుభ్రపరిచే అంశంపై నేటి కేబినెట్ సమావేశంలో చర్చించవచ్చు. ఆప్ ప్రభుత్వం ఓటమికి అతి పెద్ద కారణం యమునా నది. నురుగుతో నిండిన యమునా నదిని వీలైనంత త్వరగా శుభ్రం చేసేందుకు బీజేపీ ప్రచారం ప్రారంభించవచ్చు.