Bhu Bharathi Portal : జనవరి 1 నుంచి భూ భారతి పోర్టల్ అమల్లోకి..! …
ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు ట్రాన్సిట్ చేయనుంది టెర్రాసిస్ ఏజెన్సీ.
- By Latha Suma Published Date - 01:18 PM, Sat - 28 December 24

Bhu Bharathi Portal : భూ భారతి పోర్టల్ సేవలు జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 31 తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. దీంతో జనవరి ఒకటి నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్-NIC ద్వారా భూ భారతి పోర్టల్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు ట్రాన్సిట్ చేయనుంది టెర్రాసిస్ ఏజెన్సీ. దీంతో ధరణి మాటున భూముల కొల్లగొట్టినవారిని వెలికి తీసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నంకానుంది.
కాగా, గత ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేరను భూ భారతిగా మార్పు చేశారు. ఈ మేరకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భూ భారతి ఆర్వోఆర్-2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా కొత్త చట్టం ఉంటుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన మూడు నెలల్లోగా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. అనంతరం చట్టంలోని సెక్షన్లు అమల్లోకి వస్తాయన్నారు. ఆర్వోఆర్-2024 చట్టానికి (భూ భారతి), ప్రస్తుత ఆర్వోఆర్-2020 (ధరణి) చట్టానికి అనేక వ్యత్యాసాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి వెల్లడించారు. 18 రాష్ట్రాల ఆర్వోఆర్ చట్టాలను పరిగణనలోకి తీసుకుని కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఇకపోతే..ఈ తరుణంలోనే రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టారని ఇప్పటికే స్పష్టం చేశారట ప్రభుత్వ పెద్దలు. అర్థరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు. ఏ సర్వర్ నుండి ఏ ఐపి అడ్రస్ అయ్యారు, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు అనే అంశాలపై ఫోకస్ చేసినట్లు దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావా దేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు సమాచారం అందుతోంది. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ఇటీవల డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.