IND vs AUS 3rd ODI: చివరి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
మూడు వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
- Author : Gopichand
Date : 22-03-2023 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
మూడు వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఒకవేళ ఆసీస్ ఈ మ్యాచ్ గెలిస్తే వన్డే సిరీస్‌ను గెలుచుకోవడమే కాకుండా.. గత నాలుగేళ్లలో సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో భారత్‌ను ఓడించిన తొలి జట్టుగా నిలుస్తుంది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. చెన్నైలోని కొత్త పిచ్‌పై టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో ఒక్క మార్పు కూడా చేయలేదు. డేవిడ్ వార్నర్ మళ్లీ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చాడు. వార్నర్.. కామెరాన్ గ్రీన్ స్థానంలో ఆడనున్నాడు.
🚨 Toss Update from Chennai 🚨
Australia have elected to bat against #TeamIndia in the third & final #INDvAUS ODI.
Follow the match ▶️ https://t.co/eNLPoZpkqi @mastercardindia pic.twitter.com/JAjU6ttaJh
— BCCI (@BCCI) March 22, 2023
Also Read: Shreyas Iyer: టీమిండియాకు బిగ్ షాక్.. 5 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న అయ్యర్..!
పిచ్ రిపోర్ట్ ఇదే
చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. ఈ సారి కూడా స్పిన్నర్లదే పైచేయి. కానీ వేడి వాతావరణం కారణంగా పేసర్లు స్వింగ్, సీమ్ రాబట్టే ఆస్కారముంది. ఈ మైదానంలో 21 వన్డేల్లో మొదటిసారి బ్యాటింగ్ చేసిన జట్టు 13సార్లు గెలిచింది. చివరగా ఇక్కడ 2019 డిసెంబర్‌లో వన్డే జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన రెండు వన్డేల్లో చెరొక విజయం సాధించాయి.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ(C), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా తుది జట్టు: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చగ్నే, స్టీవ్ స్మిత్ (C), మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (WK), గ్లెన్ మాక్స్‌వెల్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.