HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Asifabad Medical College To Be Named After Konda Laxman Bapuji Cm Revanth Reddy

CM Revanth Reddy : ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు : సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు ఇస్తున్నట్టు పద్మశాలీలకు కూడా సమాన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తోందని, ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

  • Author : Latha Suma Date : 09-03-2025 - 4:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Asifabad Medical College to be named after Konda Laxman Bapuji: CM Revanth Reddy
Asifabad Medical College to be named after Konda Laxman Bapuji: CM Revanth Reddy

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన ద్వారా బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ ఆశయం అని, దానిని ఎట్టి పరిస్థితులలోనూ నెరవేరుస్తామని ఆయన అన్నారు. రైతులకు ఇస్తున్నట్టు పద్మశాలీలకు కూడా సమాన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తోందని, ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే రెండు చీరల తయారీకి సంబంధించిన రూ. 1.30 కోట్ల ఆర్డర్ ను నేతన్నలకు ఇచ్చామని తెలియజేశారు.

Read Also: Milk: పాలు తాగితే బరువు పెరుగుతార.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్యం బాపూజీ అనేక త్యాగాలు చేశారని కొనియాడారు. తెలంగాణ కోసం ఎన్నో చేశాం అని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు ఆయన చనిపోతే కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రైతులతో పాటు నేతన్నలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల్లోని స్త్రీలకు రెండు చీరల చొప్పు ఇస్తామని వెల్లడించారు. నేతన్నలకు రూ.1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ ముందుటారని అలాంటి పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా పద్మశాలీలను అభ్యున్నతే లక్ష్యమే మా ప్రభుత్వం విధానం అన్నారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది నిజం అన్నారు. అలాంటి ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే కేసీఆర్ అనే ధృతరాష్ట్రడు అలె నరేంద్ర పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహించిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ , పద్మశాలీ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also:  BRS : కేసీఆర్ అధ్యక్షతన 11న బీఆర్ఎస్ శాసన సభాపక్ష భేటీ

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • caste census
  • CM Revanth Reddy
  • congress
  • kcr
  • padmasali

Related News

Ktr Visit To Kannepalli Pum

KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • Good news for farmers from the Revanth government.

    CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

  • Good news for farmers from the Revanth government.

    Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల

Latest News

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

  • Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • E25 పెట్రోల్ నివేదికను కేంద్రం తిరస్కరించింది.. పరీక్షలు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ణయం లేదని పేర్కొంది.

  • Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd