Milk: పాలు తాగితే బరువు పెరుగుతార.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
పాలు తాగితే బరువు పెరుగుతారా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:34 PM, Sun - 9 March 25

మామూలుగా మనలో చాలామందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కొంతమంది కాఫీలు టీలు తాగితే మరికొందరు పాలు తాగుతూ ఉంటారు. అయితే ఈ పాలు తాగడంలో చాలామందికి అనేక రకాల అపోహలు ఉన్నాయి. వాటిలో పాలు తాగితే బరువు పెరుగుతాము అన్న అపోహ కూడా ఒకటి. మరి నిజంగానే పాలు తాగితే బరువు పెరుగుతారా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలా మంది పాలు తాగితే బరువు పెరుగుతాం అనుకుంటూ ఉంటారు. ఇది నిజంగానే అపోహ. ఇందులో ఏ మాత్రం నిజం లేదట. ఎందుకంటే పాలలో ఉండే పోషకాలు మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు మీ బరువును పెంచుతాయా లేదా అనేది మీరు తీసుకునే పాల రకం, తీసుకునే క్వాంటిటీపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అలాగే క్రీమ్ తొలగించిన తర్వాత పాలను తీసుకుంటే, దానిలోని క్యాలరీ కంటెంట్ తగ్గుతుందట. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.
కాబట్టి పాలు తాగితే బరువు తగ్గుతారు అన్నది కేవలం ఒట్టి అపోహ మాత్రమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పాలను పదేపదే మరిగించడం వల్ల అందులో పోషకాలు తగ్గిపోతాయని అంటూ ఉంటారు. పాలకు సంబంధించిన ఈ అపోహ పూర్తిగా తప్పు, ఎందుకంటే పాలు ఆరోగ్యంగా ఉండాలంటే కాగపెట్టడం అవసరం. పాలను బాగా కాగ పెట్టడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా తగ్గుతుందట. ఇది పాలను తాగేలా చేస్తుందట. అలాగే పాలను పదేపదే మరిగించడం వల్ల దాని పోషకాలకు ఎటువంటి హాని జరగదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.