AP Assembly : ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లలు ప్రవేశపెట్టే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి....
- By Prasad Published Date - 07:41 AM, Sat - 10 September 22

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. 15న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. . మండలి సమావేశాలు కూడా 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో మూడువ రాజధానులకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే దిశగా వైసీపీ సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా పలు కీలక బిల్లులను కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి…