Delhi Politics : విపక్ష నేతలంతా త్వరలో ఢిల్లీకి..!
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నేతలు త్వరలో ఢిల్లీలో..
- By Prasad Published Date - 08:59 AM, Wed - 28 September 22
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నేతలు త్వరలో ఢిల్లీలో కూర్చొని వ్యూహరచన చేస్తారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఇటీవల సోనియా గాంధీని కలిసిన సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఆమె సొంత పార్టీలో ఎన్నికలలో బిజీగా ఉన్నారని చెప్పారు. ఆ ఎన్నికల తర్వాత బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీల ఎజెండాలను రూపొందిస్తామని తెలిపారు. ఈ భేటీపై బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సుశీల్ కుమార్ మోదీ ప్రకటనను తాను పట్టించుకోవడం లేదని…తనని టార్గెట్ చేసి ఆయన పార్టీలో ఏదో ఒక పదవిని పొందితే తాను చాలా సంతోషిస్తానని తెలిపారు.