Major Fire Accident: పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
- Author : Gopichand
Date : 08-01-2023 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వేర్ హౌస్ బ్లాక్ లో మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Tollywood: చిరంజీవి వాల్తేరు వీరయ్య VS బాలకృష్ణ వీర సింహారెడ్డి.. ఏ ట్రైలర్ ఆశాజనకంగా ఉంది?
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పరిశ్రమలోని వేర్‌హౌస్ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములలోకి మారుస్తున్న క్రమంలో స్టాటిక్ ఎనర్జీతో ప్లాష్ ఫైర్ రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రమాదంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా(40), బీహార్‌కు చెందిన రంజిత్‌కుమార్(27), శ్రీకాకుళానికి చెందిన లోకేశ్వరరావుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.