2 Year Boy-Gun Shoot : రెండేళ్ల బాలుడి గన్ ఫైర్.. ప్రెగ్నెంట్ గా ఉన్న తల్లి మృతి
- Author : Pasha
Date : 24-06-2023 - 2:34 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికాలో దారుణం జరిగింది..
రెండేళ్ల పిల్లవాడు తన తండ్రి డెస్క్ నుంచి తుపాకీని తీసుకొని ఆడుతుండగా అది ఫైర్ అయింది.
అది ఆటబొమ్మే అనుకొని 12 రౌండ్లు ఫైర్ చేశాడు..
తుపాకీ బుల్లెట్లు.. అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి (31) వీపు భాగం నుంచి శరీరంలోకి చొచ్చుకువెళ్లాయి.
ఆమె వెంటనే పోలీసులకు కాల్ చేసింది.. హెల్ప్ చేయమని అడిగింది.. పోలీసులు హుటాహుటిన వచ్చి రక్తమోడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే ఆమె కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. ఆక్సిజన్ అందక కడుపులోని బిడ్డ ప్రాణాలు విడిచిందని డాక్టర్స్ తెలిపారు. ఈ వార్త విన్న బాధిత మహిళ కూడా 3 గంటల తర్వాత కన్నుమూసింది. మృతిచెందిన మహిళను ఒహియో ప్రాంతానికి చెందిన లారా ఇల్గ్ గా గుర్తించారు. ఆ ఇంట్లో మరో షాట్ గన్, రైఫిల్ కూడా దొరికాయని పోలీసులు తెలిపారు.
Also read : 100 Antiquities : ఆ 100 వస్తువులు ఇండియాకు ఇచ్చేస్తాం : అమెరికా
తుపాకులను పిల్లలకు అందే ఎత్తులో ఉంచొద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ ఎక్కడైనా డెస్క్ లలో ఉంచినా వాటిని పకడ్బందీగా లాక్ చేయాలని చెప్పారు. గన్ కల్చర్ అనేది అమెరికాలో ఇలాంటి ఘటనలకు కారణం అవుతోంది. గన్స్ ను దుర్వినియోగం చేసి.. ఇతర దేశాల పౌరులపై కూడా కొందరు దాడులు చేస్తున్నారు. పలువురు అమెరికన్స్ జరిపిన తుపాకీ కాల్పుల్లో గతంలో ఎందరో ఇండియన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వంతో చర్చించే దిశగా భారత్ ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.