HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >2 Killed 3 Injured In Mass Shooting At Music Festival In Us

Mass Shooting: అమెరికాలో ఆగని కాల్పుల మోత.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

వాషింగ్టన్‌లోని క్యాప్‌గ్రౌండ్‌లో శనివారం కాల్పుల (Mass Shooting) ఘటన వెలుగు చూసింది. శనివారం రాత్రి క్యాంప్‌గ్రౌండ్‌లో ఒక సంగీత ప్రదర్శనకు సమీపంలో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు.

  • Author : Gopi Date : 19-06-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shooting In Philadelphia
Open Fire

Mass Shooting: వాషింగ్టన్‌లోని క్యాప్‌గ్రౌండ్‌లో శనివారం కాల్పుల (Mass Shooting) ఘటన వెలుగు చూసింది. శనివారం రాత్రి క్యాంప్‌గ్రౌండ్‌లో ఒక సంగీత ప్రదర్శనకు సమీపంలో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు జార్జ్ పట్టణానికి సమీపంలోని క్యాంప్‌సైట్‌లో శనివారం రాత్రి 8:30 గంటలకు కాల్పులు జరిగినట్లు తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు నిందితుడిని వెంబడించారు. తరువాత అదుపులోకి తీసుకున్నారు.

ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు

ఈ కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారని, వారిలో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. కాగా మరో ముగ్గురు గాయాలతో చికిత్స పొందుతున్నారు అన్నారు. కాల్పులు జరిగినప్పుడు మ్యూజిక్ షో జరుగుతోందని పోలీసులు తెలిపారు. అమెరికాలో కాల్పుల ఘటనల వార్తలు తరచూ వస్తున్నాయి. అమెరికాలో కత్తిపోట్లు, కాల్పుల ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి.

Also Read: Pakistan Crisis: ఆర్థిక క‌ష్టాల్లో పాకిస్థాన్‌.. దివాలా త‌ప్పాలంటే ఆ ప‌నిచేయాల్సిందేన‌న్న పాక్ మాజీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్

సెయింట్ లూయిస్‌లో కూడా

సెయింట్ లూయిస్‌లోని ఒక భవనంలో ఆదివారం పార్టీ జరిగింది. ఒంటిగంట సమయంలో పార్టీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. మేయర్ తిషౌరా జోన్స్ ప్రకారం.. కాల్పుల్లో 17 ఏళ్ల బాలుడు మరణించాడు. అదే సమయంలో ఈ కేసులో 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు చీఫ్ రాబర్ట్ ట్రేసీ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

గాయపడిన వారి వయస్సు 15 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. కాల్పుల్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఘటనా స్థలం నుంచి AR-15 తరహా రైఫిల్, హ్యాండ్‌గన్‌తో సహా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పార్టీని ఎవరు ఇచ్చారనే దానిపై విచారణ జరుగుతోంది. మేయర్ జోన్స్ మాట్లాడుతూ.. అమెరికాలో కాల్పులు సర్వసాధారణమైపోతున్నాయన్నారు. రోజూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రజలు సురక్షితంగా లేరు అని పేర్కొన్నారు.

సామూహిక కాల్పులు యునైటెడ్ స్టేట్స్‌లో పెరుగుతున్న ప్రమాదకరమైన సమస్య అన్నారు. మరోవైపు దేశంలో కాల్పుల ఘటనలను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ ఆయుధాలను నిషేధించడానికి సరైన సమయం వచ్చింది అని ఆయన అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • mass shooting
  • Music Festival
  • USA
  • world news

Related News

US attacks ship off Oman coast; three Indian sailors killed.

ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భార‌త నావికులు మృతి

ఒమన్‌ తీరానికి సమీపంలో అమెరికా బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ వెల్లడించారు. తొలుత వీరు గల్లంతైనట్లు సమాచారం వచ్చినా ఇప్పుడు వారి మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే ఇప్పటివరకు లభ్యమైనట్లు తెలిపారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న సెటెబెల్లో ఆయిల్‌ ట్యాంకర్‌పై ఈ దాడి జర

    Latest News

    • Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ

    • Amazon : అమెజాన్‌లో జోరుగా టూ-వీలర్ సేల్స్!

    • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

    • Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి

    • TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

    Trending News

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd