Mass Shooting: అమెరికాలో ఆగని కాల్పుల మోత.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
వాషింగ్టన్‌లోని క్యాప్‌గ్రౌండ్‌లో శనివారం కాల్పుల (Mass Shooting) ఘటన వెలుగు చూసింది. శనివారం రాత్రి క్యాంప్‌గ్రౌండ్‌లో ఒక సంగీత ప్రదర్శనకు సమీపంలో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు.
- Author : Gopichand
Date : 19-06-2023 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Mass Shooting: వాషింగ్టన్‌లోని క్యాప్‌గ్రౌండ్‌లో శనివారం కాల్పుల (Mass Shooting) ఘటన వెలుగు చూసింది. శనివారం రాత్రి క్యాంప్‌గ్రౌండ్‌లో ఒక సంగీత ప్రదర్శనకు సమీపంలో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు జార్జ్ పట్టణానికి సమీపంలోని క్యాంప్‌సైట్‌లో శనివారం రాత్రి 8:30 గంటలకు కాల్పులు జరిగినట్లు తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు నిందితుడిని వెంబడించారు. తరువాత అదుపులోకి తీసుకున్నారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు
ఈ కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారని, వారిలో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. కాగా మరో ముగ్గురు గాయాలతో చికిత్స పొందుతున్నారు అన్నారు. కాల్పులు జరిగినప్పుడు మ్యూజిక్ షో జరుగుతోందని పోలీసులు తెలిపారు. అమెరికాలో కాల్పుల ఘటనల వార్తలు తరచూ వస్తున్నాయి. అమెరికాలో కత్తిపోట్లు, కాల్పుల ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి.
సెయింట్ లూయిస్‌లో కూడా
సెయింట్ లూయిస్‌లోని ఒక భవనంలో ఆదివారం పార్టీ జరిగింది. ఒంటిగంట సమయంలో పార్టీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. మేయర్ తిషౌరా జోన్స్ ప్రకారం.. కాల్పుల్లో 17 ఏళ్ల బాలుడు మరణించాడు. అదే సమయంలో ఈ కేసులో 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు చీఫ్ రాబర్ట్ ట్రేసీ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
గాయపడిన వారి వయస్సు 15 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. కాల్పుల్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఘటనా స్థలం నుంచి AR-15 తరహా రైఫిల్, హ్యాండ్‌గన్‌తో సహా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పార్టీని ఎవరు ఇచ్చారనే దానిపై విచారణ జరుగుతోంది. మేయర్ జోన్స్ మాట్లాడుతూ.. అమెరికాలో కాల్పులు సర్వసాధారణమైపోతున్నాయన్నారు. రోజూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రజలు సురక్షితంగా లేరు అని పేర్కొన్నారు.
సామూహిక కాల్పులు యునైటెడ్ స్టేట్స్‌లో పెరుగుతున్న ప్రమాదకరమైన సమస్య అన్నారు. మరోవైపు దేశంలో కాల్పుల ఘటనలను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ ఆయుధాలను నిషేధించడానికి సరైన సమయం వచ్చింది అని ఆయన అన్నారు.