Plane Crashes: కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు మృతి
కెనడాలోని వాంకోవర్ సమీపంలోని చిల్లివాక్‌లో విమానం (Plane Crashes) కూలిపోయింది. విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
- Author : Gopichand
Date : 07-10-2023 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
Plane Crashes: కెనడాలోని వాంకోవర్ సమీపంలోని చిల్లివాక్‌లో విమానం (Plane Crashes) కూలిపోయింది. విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలోని చెట్టును ఢీకొనడంతో విమానం కూలిపోయింది. మీడియా నివేదికల ప్రకారం.. మరణించిన ఇద్దరు భారతీయ పైలట్లు ముంబై నివాసితులు. అయితే మరణించిన వారి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయ పైలట్లు ఉన్నారు. ఈ ఘటనలో విమానం పైపర్ పీఏ-34 సెనెకా విమానం, ట్విన్ ఇంజన్ లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా గుర్తించారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ నగరంలో చిన్న విమానం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. విమానం – పైపర్ PA-34 సెనెకా, ట్విన్-ఇంజన్ లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ – స్థానిక విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మోటెల్ వెనుక ఉన్న చెట్లపై కూలిపోయిందన్నారు. చిల్లివాక్ వాంకోవర్‌కు తూర్పున దాదాపు 100 కిలోమీటర్లు (62 మైళ్ళు) దూరంలో ఉంది.
Also Read: No Dress For Women : ఆ గ్రామంలో వింత ఆచారం..వివస్త్రలుగా మహిళలు…అన్ని రోజులు ఆలా ఉండాల్సిందే
We’re now on WhatsApp. Click to Join.
వాంకోవర్‌కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలోని చిల్లివాక్‌లోని స్థానిక విమానాశ్రయానికి సమీపంలో ఈ ఘటన జరగడం గమనార్హం. నివేదికల ఆధారంగా కెనడా రవాణా భద్రతా బోర్డు సంఘటనపై దర్యాప్తు చేయడానికి పరిశోధకులను పంపుతోంది. పైలట్, మరో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేసినట్లు తెలిపారు.