Truck Falls Into River: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో బోల్తా పడిన పెళ్లి ట్రక్కు, ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి
దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుహరా గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో డీసీఎం వాహనం (Truck Falls Into River) బోల్తా పడింది.
- By Gopichand Published Date - 11:45 AM, Wed - 28 June 23

Truck Falls Into River: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుహరా గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో డీసీఎం వాహనం (Truck Falls Into River) బోల్తా పడింది. ఇందులో డజను మందికి పైగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు వాహనంలో ఉన్న 3 డజన్ల మందికి పైగా గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఈ ఘటనపై దృష్టి సారించారు. స్థానిక అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ట్రక్కు అదుపు తప్పి నదిలో పడింది. దీని కారణంగా చాలా మంది మరణించారు. మినీ ట్రక్కులో ఉన్నవారు తికామ్‌గఢ్‌లోని జాతరలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గ్వాలియర్‌లోని బిల్హేటి గ్రామం నుంచి వెళ్తున్నారు. బుహరా గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర వాహనం బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. దటియా పోలీస్ సూపరింటెండెంట్ ప్రదీప్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: Police Shoot: 17 ఏళ్ళ యువకుడిని కాల్చి చంపిన ట్రాఫిక్ పోలీసులు.. ఎందుకంటే..?
ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి
మంగళవారం దాటియాలో మినీ ట్రక్కు నిర్మాణంలో ఉన్న వంతెనపైకి దూసుకెళ్లి బుహరా నదిలో పడిపోవడంతో కనీసం 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. పెళ్లి నిమిత్తం గ్వాలియర్ నుంచి తికామ్‌గఢ్‌కు మినీ ట్రక్కులో వెళ్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. కొంతమంది తప్పిపోయారు. SDRF బృందం వారి కోసం వెతుకుతోంది. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ట్రక్కులో 50-60 మంది ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.