Andhra Pradesh : పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
- By Prasad Published Date - 08:55 AM, Fri - 21 October 22

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, హోమంత్రి తానేటి వనిత హాజరైయ్యారు. అమరులు వారు అనే పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత, పోలీసు ఉన్నతాధికారులు నివాళ్లు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు హోమంత్రి వనిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.